JN: బచ్చన్నపేట మండలం నారెడ్డిపల్లి గ్రామంలో వడదెబ్బతో ఆదివారం వృద్ధురాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన తేలు పెద్ద మల్లవ్వ(70) తీవ్ర ఎండలతో అస్వస్థతకు గురయ్యింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.