NLG: చిట్యాల మండలంలో అతి చిన్న గ్రామపంచాయతీగా బొంగోనిచెరువు గ్రామం ఉంది. ఈ గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటయింది. గ్రామంలో 8 వార్డులు ఉండగా మొత్తం 498 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. వారిలో పురుషులు 243, మహిళలు 255 మంది ఓటర్లుగా ఉన్నారు. గ్రామంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఇరువురు పోటీ పడుతున్నారు.