ADB: అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం పట్టణంలోని చించర్ వాడలో కొనసాగుతున్న జడ కొప్పులాటలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానికులతో కలిసి కోలాటం ఆడుతూ సందడి చేశారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు.