GDWL: ధరూర్ మండలం పెద్దచింతరేవుల ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రికను శనివారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.