NGKL: అచ్చంపేట మండలంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 38 గ్రామ పంచాయతీలకు గాను 249 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. అలాగే, 312 వార్డులకు 726 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మిగిలి ఉంది. ఉపసంహరణ తర్వాత తుది జాబితా ఖరారు కానుంది.