WGL: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఖజానాలు ఒక్కసారిగా లక్షల రూపాయలతో నిండిపోయాయి. అభ్యర్థులు, ప్రతిపాదకులు నామినేషన్ వేయడానికి బకాయి ఇంటి పన్ను, నల్లా పన్ను తప్పనిసరిగా క్లియర్ చేయాల్సి రావడంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు పెద్ద ఎత్తున వసూలయ్యాయి. దీంతో పంచాయతీల ఖజానా నిండిపోయాయి.