MNCL: చెన్నూరు మండలం కిష్టంపేటలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్, నాయకులతో కలిసి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా వరి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలులో జరుగుతున్న ఆలస్యంపై మండిపడ్డారు. అనంతరం AO యామినికి ఫోన్ చేసి కొనుగోలు జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.