ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల ‘పంచాయతీ’ వేడెక్కింది. దాదాపు 2ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బరిలో నిలిచేందుకు ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయడం నేతలకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా ఒక్కరినే బరిలో దించేందుకు, నామినేషన్ల ఉపసంహరణకు నాయకులు బుజ్జగిస్తున్నారు.