WGL: జిల్లా వ్యాప్తంగా కుక్కల బెడద రోజు రోజుకూ పెరిగిపోతుందని ప్రజలు ఆరోపించారు. పల్లెల, పట్టణాలలో తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడి చేస్తున్నట్లు ప్రజలు పేర్కొన్నారు. గత 10 నెలలో 2222 కుక్క కాటు కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించాల్సిందిగా ప్రజలు కోరారు.