VKB: సొంత స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండి గౌతమ్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల పనులను పూర్తి చేయాలని వారికి సూచించారు.