BHPL: కాటారం మండలంలో బస్టాండ్ నిర్మాణం కోర్టు కేసు కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని ప్రజలు రోడ్డు పైన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సందర్భంగా ఓట్లు అడిగేందుకు వచ్చే అభ్యర్థులను.. ఓటర్లు బస్టాండ్ నిర్మాణం త్వరగా చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. గెలవగానే ముందుగా నిర్మాణానికి చర్యలు చేపడతామని అభ్యర్థులు హామి ఇస్తున్నారు.