MNCL: వడదెబ్బతో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందాడని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. జన్నారం మండల కేంద్రంలోని పోన్కల్ బ్రిడ్జి వద్ద నుండి బస్టాండ్ వైపు మే 20న మతిస్థిమితం లేని వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళగా వడదెబ్బతో కళ్ళు తిరిగి పడిపోయాడన్నారు. ఆయనను స్థానికులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడని SI తెలిపారు.