సూర్యాపేట: అనంతగిరి మండల కేంద్రంలోని ఉపాధిహామీ కార్యాలయంలో DRDA ద్వారా ఏర్పాటుచేసిన తాగునీటి ఫ్రిడ్జ్ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. గతంలో కొద్ది రోజులు పని చేసిన ఈ ఫ్రిడ్జ్‌ను పట్టించుకోకపోవడంతో ఉపాధి పనులపై వచ్చే ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయానికి వచ్చినప్పుడు నీటిని కొనుక్కొని తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.