SRPT: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేపల సింగారం వద్ద అదుపుతప్పిన కారు ఫల్టీలు కొట్టి ప్రక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గురైన వాహనం హుజూర్ నగర్ మండలం నల్లబండ గూడెంకి చెందినదిగా గుర్తించారు.