వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో ఓ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కోటర్ మందు పంపిణీ చేయగా, ఈ విషయం తెలిసి కాంగ్రెస్ అభ్యర్థి అరకిలో చొప్పున చికెన్ పంపిణీ చేశారు. పోలింగ్‌కు ముందు రోజు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రెండు పార్టీల అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా పోటీ పడుతున్నారు. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.