MNCL: చెన్నూర్ మండలంలోని కిష్టంపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో మద్దతు ధర ప్రకారం నగదు జమ చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు.