BHPL: వరి కొయ్యలను తగలబెట్టడం వల్ల పర్యావరణానికి, భూమి సారానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఘనపూర్ సీఐ కరుణాకర్ హెచ్చరించారు. కొయ్యలు కాల్చితే మట్టిలోని పోషకాలు నశించి, వాయు కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. పంట వ్యర్థాలను కలియదున్నితే సేంద్రీయ ఎరువు తయారై భూసారం పెరుగుతుందని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి కొయ్యలు కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.