RR: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని 31న నిర్వహించే ఈవెంట్లకు మేనేజ్మెంట్ సంస్థలు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ఈవెంట్ల నిర్వాహకులు ఈనెల 21లోపే వెబ్సైట్ పోర్టల్ ద్వారా అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. 21 తర్వాత సమర్పించిన దరఖాస్తులు తీసుకోమని స్పష్టం చేశారు.