NRML: దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామ రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. చేపట్టిన రిలే దీక్ష సోమవారం 19వ రోజుకు చేరింది. దీంతో రైతులు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. గత 19 రోజుల నుండి దీక్ష చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు.