SRD: జిన్నారం మున్సిపాలిటీలో చలి తీవ్రత పెరగడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. బుధవారం ఉదయం వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉష్ణోగ్రత 14.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గాలిలో తేమ శాతం 91.8% ఉండటంతో చలి మరింతగా అనిపిస్తోంది. ఉదయం పూట చల్లని గాలులు వీచడంతో ప్రజలు ఇంటి బయటకు వెళ్లడానికి కూడా కొంత వెనుకంజ వేస్తున్నారు.