HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. యూసఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుండగా కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. కాగా, ఈ ఉపఎన్నికలో ఎవరు గెలిచినా విజయోత్సవాలకు అనుమతి లేదన్నారు.