KMM: గుర్తింపు పొందిన కార్మిక, అధికార సంఘాలతో జరిగిన సంయుక్త సంప్రదింపుల కమిటీ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయని సింగరేణి CMD ఎన్. బలరాం తెలిపారు. కార్మిక సంఘాల సూచనల మేరకు మెడికల్ అటెండెన్స్ నిబంధనలను సరళతరం చేస్తామని చెప్పారు. కార్మికులు, అధికారులకు రావాల్సిన పదోన్నతుల్లో ఎటువంటి జాప్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు.