NZB: మోస్రా మండలం చింతకుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు గ్రామస్థులకు వివిధ హామీలిస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో నీటి కుళాయిలకు సంబంధించిన మోటార్ల కొరత ఉండేదని, తాను గెలిస్తే మోటార్లను అదనంగా పెంచి వెంటనే నీటి సమస్య తీరుస్తానని వంగ నీలిమ-సాయ గౌడ్ హామీ ఇస్తున్నారు. ప్రతీ వార్డుకు కంప్లెంట్ బాక్స్ పెట్టి 24 గంటల్లో సమస్య తీరుస్తానన్నారు.