HYD: హైసిటీ ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి రూ. 663.50 కోట్లు విడుదల చేసింది. ప్రాజెక్టు పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ. 2,654 కోట్లు కేటాయించగా.. వీటిలో ఇప్పటి వరకే 1,327 కోట్లు విడుదలయ్యాయి. వీటితో పాటు వృత్తి పన్ను పరిహారం కింద రూ.10 కోట్లు, జీహెచ్ఎంసీకి పరిహారం కింద రూ. 10 కోట్లు విడుదల చేసింది.