MDK: నార్సింగి మండల కేంద్రంలోని మీర్జాపల్లి చౌరస్తా వద్ద ఎఫ్ఎస్టీ బృందం తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. కారు, ఆటోల్లో తరలిస్తున్న సుమారు 400 క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సౌజన్య తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.