ADB: విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలంలో మన్నూర్ పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధి హామీ (జల్ సంచయ్ జన్ బాగిదారి) పథకం అమలులో భాగంగా న్యూట్రీ గార్డెన్, RO వాటర్ ప్లాంట్ ప్రారంభించి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.