పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. పిట్టల రవికుమార్ గ్రామ సర్పంచ్‌గా, పెండం శ్రీకాంత్ ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 1వ వార్డు 2, 3, 4, 6, 7, 8వ వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ గ్రామ అభివృద్ధికి దోహద పడుతుందని భావిస్తున్నారు.