MLG: ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంజీరాల దేవయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క ఆదివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేవయ్య కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.