SRCL: నామినేషన్ విత్ డ్రా చేసుకోమని కొట్టి బెదిరించిన వారిపై కేసు నమోదు చేశామని తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లిలో సుంకపాక శరత్ మొదటి వార్డులో నామినేషన్ వేశాడన్నారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోమని అదే గ్రామానికి చెందిన దేవచంద్రం, సాయి, రాజు, కిషన్ ఇంటికి పిలిపించుకుని బెదిరించి కొట్టారని వివరించారు.