SRD: శుక్రవారం జరిగే సంతను గంజి మైదానంలోకి తరలించాలని కోరుతూ కూరగాయల వ్యాపారులు ఇవాళ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ.. ఈ సంత రోడ్డుపై జరగడంతో తాళ్లపల్లి గ్రామస్తులతో పాటు వివిధ కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సోమవారం జరిగే గంజి మైదానంలోకి మార్చాలని డిమాండ్ చేశారు.