MNCL: పంచాయతీ ఎన్నికలలో భాగంగా 3వ విడత నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చెన్నూర్ మండలంలోని కిష్టంపేటలో ఈ నెల 3 నుంచి జరిగే 3వ విడత నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.