ADB: ఆధార్ సేవల్లో వేగం, ఖచ్చితత్వం పెంచాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ఆధార్ ఆపరేటర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సేవల్లో ఆధార్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దరఖాస్తులు పెండింగ్లో ఉండకూడదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవల నాణ్యతను పెంచాలని ఆదేశించారు.