నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 21 ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ఫోన్లను శనివారం బాధితులకు అందజేసినట్లు చెప్పారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.