HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ఓ ప్రయాణికుడికి RPF పోలీసులు మానవత్వాన్ని చాటారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి, సాంకేతిక సహాయంతో మొబైల్‌ను గుర్తించారు. అనంతరం బాధితుడిని పిలిపించి, రూ.14,492 విలువైన మొబైల్ ఫోన్‌ను సురక్షితంగా తిరిగి అప్పగించారు.