WGL: వరంగల్ జిల్లాకు చెందిన గురుకుల డిగ్రీ కళాశాల MPC సెకండ్ విద్యార్థిని నందిని ఈనెల 9 నుంచి 11 వరకు విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ విశ్వవిద్యాలయ టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఇవాళ ప్రిన్సిపల్ డా.రాధిక, వ్యాయామ అధ్యాపకురాలు డా.పద్మ, అధ్యాపకులు నందిని ఇంటికి వెళ్లి అభినందించారు. కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.