HYD: కాలుష్య రహిత ప్రయాణం కోసం గ్రేటర్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు (ఈవీలు) పరుగులు తీస్తున్నాయి. ఈ నెలలో కొత్తగా మరో 50 బస్సులు (ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, డీలక్స్ విభాగాల్లో) అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 225 బస్సులు ప్రవేశపెట్టనున్నారు. దీంతో గ్రేటర్ జోన్లో మొత్తం ఈవీల సంఖ్య 540కి చేరనుంది.