KMR: హైవే పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన 44వ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వెనక నుంచి లారీ ఢీకొనడంతో కానిస్టేబుల్, హోంగార్డులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సదయ్య అనే కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కాగా,హోంగార్డ్ స్వామిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.