KMM: యువతలో ఆసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని కలెక్టర్ అన్నారు. ఖమ్మం జిల్లా పర్యాటక వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి కలెక్టర్ దివాకర టిఎస్ ‘టూరిజం కిట్’ను శనివారం విడుదల చేశారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు.