జనగామలో నిత్యం ఏదో విధంగా ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఎన్నోఏళ్లుగా ప్రజల మెప్పు పొందుతున్నారు. అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతెన మణికుమార్ మాట్లాడుతూ.. ముఖ్యంగా భారతదేశంలో ఆకలి చావులు లేకుండా నియంత్రణే లక్ష్యంగా మహా అన్న సమర్పణ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు నిర్వహించాలని పిలుపునిచ్చారు.