GDWL: జిల్లాలో మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరిగే గట్టు, గద్వాల్, కేటిదొడ్డి, ధరూర్ మండలాల్లోని పాఠశాలలకు డిసెంబర్ 10, 11 తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ నెల 11న జరగనున్న మొదటి విడుత ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సెలవు ఇస్తున్నట్లు డీఈఓ విజయలక్ష్మీ తెలిపారు. నేటితో గ్రామాల్లో మైకులు మూగబోనున్నాయి.