SRCL: ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామానికి చెందిన పిట్ల దేవరాజు(45) అనే వ్యక్తి బహ్రెయిన్‌లో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గురువారం బాత్ రూమ్‌లో జారిపడి మృతి చెందాడని, దేవరాజు పనిచేస్తున్న కంపెనీకి చెందిన అధికారి తెలిపరన్నారు. దేవరాజుకు భార్య స్వప్న, ఇద్దరు కొడుకులు ప్రణయ్, సందీప్ ఉన్నారు.