NLG: ఉమ్మడి జిల్లాలో రేపటి నుంచి భారీగా ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 10-15 డిగ్రీల సెల్సియస్, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9-12 డిగ్రీల సెల్సియస్ నమోదు కానుంది. 10వ తేదీ 3 రోజులపాటు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు.