NRPT: గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మరికల్ మండలంలోని వెంకటాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొత్తపల్లి రాజేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలో తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, రోడ్ల, వీధి దీపాలుపై దృష్టి సాధిస్తానన్నారు.