KMM: ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అవగాహన కార్యక్రమంలో ఖమ్మం అడిషనల్ డీసీపీ రామానుజం పాల్గొన్నారు. డిజిటల్‌గా అరెస్టు చేస్తామని బెదిరించే సైబర్ మోసగాళ్లను నమ్మవద్దని హెచ్చరించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీలు అపరిచితులతో పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దని సూచించారు. మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.