మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ షరీఫ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, స్థానికులు పాల్గొన్నారు.