BDK: భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో జనవరి 18న 5 లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు వేలాదిగా కదలి రావాలని ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల కేంద్రంలో బహిరంగ సభ పోస్టర్లను ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎర్రదండు తరలి రావాలని పిలుపునిచ్చారు.