NLG: నకిరేకల్ మండలం మండలాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొనడంతో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బలపరిచిన తీగల నాగయ్యకు ఎదురుగా ఆయన అన్న తీగల వెంకటయ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. వీరితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి జంగయ్య, మరో స్వతంత్ర అభ్యర్థి నర్సింహ పోటీలో ఉండటంతో ఈ గ్రామంలో పోరు రసవత్తరంగా మారింది. విజయం ఎవరిదో వేచి చూడాలి.