MDK: హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఎంపీడీవో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సామగ్రిని కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని అన్ని ఏర్పాట్లను పర్యటిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు.