WGL: వీధికుక్కల దాడిలో గొర్రెపిల్ల మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం నర్సంపేట పట్టణంలోని 18వవార్డులో వెలుగుచూసింది.18 వ వార్డులో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదుచేసిన ఎవరు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడద ఎక్కువై వార్డులో వృద్ధులు తిరిగే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.