NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి టైటాన్స్ రౌండ్ టేబుల్ ఇండియా 303 క్లబ్ (హైదరాబాద్) ద్వారా దాదాపు రూ.7 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను బుధవారం అందజేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.ఉషారాణి ఈ యంత్రాలను స్వీకరించారు. ఐసీయూ, క్యాజువాలిటీ, మెడికల్ కేర్ వార్డులలో ఈ ఆక్సిజన్ యంత్రాలను ఉపయోగించనున్నట్లు తెలిపారు.